అంధేరా ప్రదేశ్ - Dark Knight vows of AP

ఆంధ్ర  ప్రదేశ్, ఈ పేరు వినగానే కొందరికి మింగుడు పడదు! మరికొందరు ఘుస్సా ఐతరు! ఏది ఏమైనపటికి అందరిని మెప్పించాలన్న ఒకేఒక్క ఉదేశ్యంతో, చితసుద్ధితో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. రాజు అనుకుంటే దేనికి కొదవ? వెంటనే పేరు మార్చండి అన్నారు. ఎలా మార్చుదాం, ఎవరిని నొప్పించకుండా, ప్రతియవాదం లేకుండా, అన్ని ప్రాతాల వాళ్ళని ఒకే తిపైకి తెచేవిధంగ ఈ పేరు ఉండాలి అని ఒక మంత్రి వర్యులు నిశ్చయించుకున్నాడు.
"ఆమ్ఫాట్ , బూం, బూం, ఫట్ స్వాహా : అన్నాడు" ఆ మంత్రానికి అర్ధం ఆ అమత్యులవారికి కూడా తెలియదు! ఏమి జరుగుతుందిరా దేవుడా అని... ఆత్రంగా ఎదురుచూస్తున్నా ఆ మాత్రి, ఉన్నఫళంగా చీకట్లో చిక్కుకున్నాడు.  ఏదో బేతాళ కధలో మాదిరిగా ఇలా అయ్యింది ఎంటిరా అని ఆలోచిస్తుండగా మంత్రిగారిని పొగుడుతూ, చపట్లతో ముంచెత్తారు తోటి మంత్రులు. ఒక్కముక్క కూడా అర్ధం కానీ మంత్రి, బిత్తర చూపులతో తన P .A వంక చూసాడు. వెంటనే  P .A, సార! ఇది అంధకారం!!! అంటే అంధేరా!!! అంతే సంగతులు , మిగతా మంత్రులు అందరు కలసి, అంధేరా ప్రదేశ్ అని మన తెలుగు వారి రాష్ట్రము పేరుని మార్చేసారు. పనిలో పని, వెంటనే పేరు మారుస్తూ ఒక G .O  పాస్ చేసాడు ఆ మాత్రి.

తను అనుకున్నది సాధించాడు. చీకటికి - ప్రాంతీయత ఉండదు, - వేర్పాటువాదుల బూతు ప్రుఅనలు ఉండవు, మరికొంతమంది దిక్కుతోచని వాళ్ళ  - పనికి రాణి ప్రసంగాలు ఉండవు. అన్నింటికీ మించి చీకటి అందరిని ఒకేతాటిపై పెట్టింది. దెబ్బకి దుకాణాలు బంద్. పరిశ్రమలకి locks. వ్యాపారాలు నడవవు, పని ఎచేతోడు ఎవ్వడు. ఎదిఐథెనెమ్ రాజు గారు అనుకున్నది సాధించి అందరిని ఒకేతతిపై నడిపించినందుకు, అధిష్టానం ఆయనని ఢిల్లీ పిలిచిమారి వెండి పూత పోసిన పట్టు తువలుతో సత్కరించింది.

చిన్నప్పుడు Shakthiman సీరియల్ DD -1   లో చుసిన ప్రతిఒక్కరికి ఈ dialogue గుర్తుంది ఉంటుంది - "అంధేరా కాయం రహేగా "  అంటే చీకటి రాజ్యం స్థాపించబడింది అని.

Share this

Related Posts

Previous
Next Post »